Tuni: జనసేనపార్టీలో చేరిన వైసిపి కీలకనేత తొండంగి మండలం మాజీ జెడ్పీటీసీ శ్రీ చొక్కా కాశీ

తూర్పుగోదావరి జిల్లా, తుని నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలకనేత, తొండంగి మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ చొక్కా కాశీ జనసేన పార్టీలో చేరారు. కాకినాడ హాల్కన్ టైన్స్ క్లబ్ లో జరిగిన ఓ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ కండువా కప్పి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ బలోపేతం చేయడంలో తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీ కాశీ స్పష్టం చేశారు. శ్రీ కాశీ జనసేనలో చేరడం తుని నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్టయ్యింది. కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణలతో పాటు వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు పాల్గొన్నారు.