ఇందుకూరుపేట మండలం, కుడితిపాలెం వద్ద గిరిజన బాలిక చెంచమ్మపై జరిగిన అమానుష సంఘటనకు ప్రజలు కలవరపడుతున్న వేళ, నెల్లూరు జిల్లా జనసేన సీనియర్ నాయకుడు టోనీ బాబు తన ఉదాత్తతను చాటుకున్నారు. ఫోన్ దొంగిలించిందన్న నిందతో చెంచమ్మను దుండగులు కాల్చిన దారుణ ఘటనపై స్పందించిన ఆయన, బాలికను నెల్లూరు అపోలో ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా టోనీ బాబు మాట్లాడుతూ, ఒక నిరుపరాధ గిరిజన బాలికను కాల్చడం మనుషులకే తలవంచేలా ఉంది. ఇలాంటి ఘటనలు తిరిగిరాకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, అని అన్నారు. ఈ ఘటనపై స్పందించిన వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమీరెడ్డి ప్రశాంతి దంపతులు బాలికను పరామర్శించి, వి.పీ.ఆర్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన మద్దతును అందించనున్నట్టు తెలిపారు. జనసేన పార్టీ ఎప్పటికీ గిరిజనుల అండగా ఉంటుందని టోనీ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఏ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ భాష సహా పలువురు పాల్గొన్నారు. ఇటువంటి సంఘటనలకు ఇక చోటు ఇవ్వకూడదనే సామాజిక చైతన్యం పట్ల జనసేన తీసుకుంటున్న బాధ్యతాత్మక వైఖరి ప్రశంసనీయమైంది.
Share this content:
Post Comment