నెల్లూరు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జనసేన సీనియర్ నాయకుడు పి. టోనీ బాబు పాల్గొన్నారు. ఇటీవల నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్‌లో హార్ట్ సమస్యతో బాధపడుతున్న 10 ఏళ్ల బాలుడి సమస్యపై స్పందించిన టోనీ బాబు, ఆ పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ లేకపోవడంతో తక్షణమే జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఆరోగ్యశ్రీ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టోనీ బాబు మాట్లాడుతూ, ఇలాంటి సమస్యల్లో ప్రభుత్వం పేదల పక్షాన నిలవాల్సిన అవసరం ఉందని, జనసేన కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. జనసేన పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుంది అని ధీమా వ్యక్తం చేశారు.
Share this content:
Post Comment