నెల్లూరు రూరల్ లో టోనీ బాబు వినూత్న చొరవ

ఇంటింటికీ క్రియాశీలక సభ్యత్వ కిట్ పంపిణీ

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ బృందావన కాలనీలో జనసేన పార్టీ సీనియర్ నేత పి. టోనీ బాబు వినూత్న కార్యక్రమాన్ని రెండో రోజు కూడా కొనసాగించారు. క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న పార్టీ శ్రేణుల ఇంటికి స్వయంగా వెళ్లి జనసేన కిట్లు అందజేయడం ద్వారా వారిని గౌరవించారు. ఈ సందర్భంగా టోనీ బాబు మాట్లాడుతూ, జనసేన అధినేత మరియు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలపై అన్నగా ప్రేమ చూపుతున్నారని, దేశంలోనే తొలిసారిగా పార్టీ సభ్యత్వాన్ని ఈ విధంగా క్రమబద్ధీకరించడం ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. బృందావన కాలనీలో రోడ్ల సదుపాయం కల్పించేందుకు కూటమి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కృషి చేస్తారని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కోటం రెడ్డి సోదరుల అభివృద్ధి ప్రస్థానం ౠరల్ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కిరణ్, నయీం, దివ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఈ వినూత్న కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంది.

Share this content:

Post Comment