అవినీతి పుత్రుడు భూ కబ్జాదారులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

• రాప్తాడు నియోజకవర్గంలోని ఆలమూరు గ్రామంలోని జగనన్న కాలనీని మీ అడ్డగోలు సంపాదనకు ప్రతీకగా మార్చుకున్నారు.
• జగనన్న కాలనీల పేరుతో ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు.
• ఆలమురు కాలనీలో 5,315 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి 4,834 ఇల్లు పూర్తి దశలో ఉన్నాయని అంటున్నావ్ అక్కడ మేము ప్రత్యక్షంగా పరిశీలించగా 5వందల ఇల్లు కూడా పూర్తి కాలేదు.
• ఎకరా 5 లక్షల విలువ చేయని భూమికి కూడా 20 లక్షలు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.
• తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి నీకులేదు.
• అంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి,రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆలమూరు జగనన్న కాలనీని అవినీతికి నిలయంగా మలచుకొని అవినితిసొమ్ము నికుసగం నాకు సంగం అనేవిధంగా వ్యవహరిస్తూ పేదప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.
• జగనన్న కాలనీలను వైసిపి ప్రజాప్రతినిధులు ఏటీఎం కార్డులు లాగా ఉపయోగించుకుంటున్నారు.
• మంత్రి ఉషశ్రీ చరణ్ మీ జగన్ రెడ్డి నిర్మిస్తున్నది జగనన్న కాలనీలు ఊర్లకు ఊర్లు కాదు పేదల పాలిట యమపాషాలు.

  • రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మీడియాతో మాట్లాడుతూ గత మూడు రోజులుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 12, 13, 14 తేదీలలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమానికి పిలుపునిచ్చి జగనన్న కాలనీల పేరుట వైసీపీ ప్రభుత్వం అవినీతిని ప్రపంచానికి తెలియజెప్పేల రాష్ట్రం మొత్తం ఒక ఉద్యమంలా చేయాలని సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ గారి పిలుపు ఇచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గం అవినీతి ఎమ్మెల్యే తోపిదుర్తి ప్రకాష్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి చాలెంజ్ చేస్తూ వచ్చి తన నియోజకవర్గంలోని ఆలమూరు గ్రామం వద్ద జగనన్న కాలనీ పరిశీలించమన్నాడని ఆయన చాలెంజ్ ఆయన అవినీతిని ఎండగట్టడానికి 12వ తేది స్వయంగా మేమే ఆలమూరు కాలనీని పరిశీలించడం జరిగిందని ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలకు ఇక్కడ జరుగుతున్న పనులకు ఏమాత్రం పొంతనలేదని ఆయన 125 ఎకరాలలో 5,135 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇప్పటికీ 4,835 ఇల్లు పూర్తి దశలో ఉన్నాయని చెప్పారు కానీ అక్కడ ఎకరా 5 లక్షలు విలువ చేసే భూమికి 20 లక్షలు చెల్లించి 187 ఎకరాల భూమిని కాలనీకి తీసుకొని తీరా 125 ఎకరాలలోనే ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి మిగిలిన 62 ఎకరాలు ప్రకాశ్ రెడ్డి తన బినామీలకు బదిలీ చేసి అక్కడ ఇప్పటివరకు కేవలం 500 ఇల్లు మాత్రమే నిర్మూలంలో ఉన్నాయని తెలియజేస్తున్నామని అదేవిధంగా ప్రకృతి వనరులను వైసీపీ ప్రభుత్వం ద్వంశం చేస్తూ కాలనీ పేరుతో కొండను తవ్వి ఎర్ర మట్టిని సైతం అమ్ముకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు, ఇక అక్కడ మౌలిక సౌకర్యాలైన రోడ్డుకానీ, విద్యుత్తుగానే, నీటి సరఫరా గాని ఏమాత్రం లేవు ఇక ప్రకాశ్ రెడ్డి ఆలమూరు కాలనీలో పార్కులు కడతా, గుళ్ళు కడతా అంటున్నాడని ముందు పేదప్రజల ఇల్లులు కట్టమని మేము అడుగుతున్నాము. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పవన్ కళ్యాణ్ నీ విమర్శించే ముందు నీ గత అవినీతి చరిత్ర గుర్తు చేసుకో. మంత్రి ఉషశ్రీ చరణ్ జగన్ రెడ్డి కడుతున్నది ఊర్లకు ఊర్లు కాదు మీ అవినీతి సొమ్మును పెంచుకునేందుకు జగనన్న కాలనీలు ఒక ఏటీఎంలు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గతంలో నిర్మించిన దాదాపు 80 శాతం పూర్తి అయిన టిడ్కో ఇళ్లను జగన్ రెడ్డి కక్షపూరిత చర్యలతో లబ్ధిదారులకు అందివ్వకుండా జగనన్న కాలనీల పేరుతో మరో తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, రూరల్ కన్వీనర్ గంటా రామాంజనేయులు, వీరమహిలలు కాశెట్టి సావిత్రి, శైలజ, కుల్లయమ్మ, దర్భీ తదితరులు పాల్గొనడం జరిగింది.