శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి కార్యాలయంలో నూతన భవన నిర్మాణ అనుమతుల విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ అధ్యక్షతన, వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ సమక్షంలో సుడా పరిధిలోని లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ తో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెక్నికల్ పర్సన్స్ నుండి వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వానికి నివేదించనున్నట్లు సుడా చైర్పర్సన్ తెలిపారు. భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించి, అభివృద్ధిని వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతులను సులభంగా పొందేందుకు అవసరమైన మార్పులను ప్రతిపాదిస్తామని తెలిపారు. నగర, జిల్లా స్థాయిలో సమన్వయంతో అభివృద్ధి పనులు జరగాలని ఆకాంక్షించిన చైర్పర్సన్, నిర్మాణ అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా పూర్తి కావడమే లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ పీఓ, ఎపిఓ, జెపిఓ మరియు సుడా అధికారుల బృందం పాల్గొని చర్చలు జరిపారు.
Share this content:
Post Comment