సస్యరక్షణా చర్యలపై రైతులకు శిక్షణా కార్యక్రమము

రాజంపేట: బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలంలో (ఉద్యాన శాఖ) మండల అధికారి శ్రీమతి వనిత మాట్లాడుతూ మామిడి తోటల్లో పూత, పిందె దశలో తీసుకోవలసిన సస్యరక్షణా చర్యలపై రైతులకు శిక్షణ కార్యక్రమము వివిధ గ్రామాల్లో పర్యటించి రైతు భరోసా కేంద్రాల్లో మామిడి రైతులకు అవగాహన కల్పిస్తూ, పూత పిందె దశలో మొదటి పిచికారి లమిడ, సల్పర్, మల్టికే, ఆర్కా మేంగో స్పెషల్, రెండోవ స్ప్రేలో ఇమిడా, ఎగ్జా కొనజోలు, వేపనూనె మూడవది తాయోమితక్షను, షాప్ ఇలా చేసుకోవాలని సూచించారు. అలానే రైతు బంధువు మరియు జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ మామిడి పంటల దిగుబడి కోసం ముందు చూపు తో అధికారుల ద్వారా అవగాహన చేసుకుని సరైన విధానంలో పంటలను సాగు చేసుకుని లాభసాటి ధరలతో గతంలో వచ్చే నష్టాలను అధిగమించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుండుపల్లి ఉద్యాన శాఖ సహాయకులు మల్లిఖార్జున, గ్రామ వ్యవసాయ శాఖ సహాయకులు ముకుందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.