శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కోటి వృక్షార్చన కార్యక్రమం

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోటి వృక్షార్చన ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పానేకర్, సీఐఎస్‌ఎఫ్ డీజీ ఎంకే సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రానికి చేరుకున్న ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. మొదటి మొక్కలను కొచ్చిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికులు అందుకున్నారు.