జనసేన-టిడిపి పొత్తుతో వైసీపీలో వణుకు

రాప్తాడు సిద్ధం సభలో విలేకరి దాడిపై జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గౌతమ్ కుమార్ తీవ్రంగా ఖండించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భయం పట్టుకుందని, జనసేన-టిడిపి పొత్తుతో వైసిపి శ్రేణులకు వణుకు మొదలైందని రాప్తాడు సిద్ధం వేదికగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేశాయని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ తెలిపారు. సిద్ధం వేదికగా జగన్మోహన్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఖండించారు. టీ గ్లాసు ఎక్కడ ఉంచాలో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు తుప్పు పట్టిన ఫ్యాన్ ని ఎక్కడ ఉంచాలో ప్రజలకు ఇంకా బాగా తెలుసు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని తెలియజేశారు. నీతి నిజాయితీ గల జనసేన అధినేత గురించి తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. సిద్ధం సభ వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయాన రౌడీ మూకలు మూకుమ్మడిగా విలేకరిపై దాడిని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం మొన్నటి రోజున ఉరవకొండ నియోజకవర్గం లో సామాజిక యాత్ర అని కార్యక్రమంలో కూడా విలేకరిపై దాడి జరిగిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులపై దాడిని కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయవలసిందిగా కోరడమైనది. ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ 99 శాతం హామీలను పూర్తి చేసామని ప్రగల్బాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన హామీలపై శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం ఉందా. 2019 ఎన్నికల్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలోనే అంశాలు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు దాని ఊసే లేదు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీకున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఇప్పటికే నాలుగు జనవరీలు అయిపోయాయి అయినా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి విపత్తు నిది కింద 7వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు బడ్జెట్లో వాటి ఊసే లేదని అన్నారు. విడపనకల్ మండల అధ్యక్షులు తలారి గోపాల్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు మానుకోవాలని మీరు 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉరవ కొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, వజ్రకరూరు మండల అధ్యక్షుడు అచ్చనాల కేశవ, విడపనకల్ మండల అధ్యక్షులు తలారి గోపాల్, కుడెరు మండల అధ్యక్షులు నగేష్, దేవేంద్ర, రాజేష్, రమేష్, మనికుమర్, నరేంద్ర, బోగేస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.