కేవలం ఓటు బ్యాంకులా మాత్రమే గిరిజన ప్రాంతాలు

రంపచోడవరం నియోజవర్గం: దేవిపట్నం మండలం,
చింతలగూడెం నుండి మామిడివలస గ్రామాలకు ప్రధాన రహదారి అధ్వాన స్థితిలో ఉంది. 76వ స్వాతంత్ర భారత దేశంలో ఇప్పటికి స్వాతంత్ర్యం రాలేదు అన్నా నమ్మగలరా? కేవలం ఓటు బ్యాంకులా మాత్రమే గిరిజన ప్రాంతాలను వాడుకుంటున్నారు తప్ప ప్రపంచమంతా ఉరుకులు పరుగులతో ముందుకెళ్తుంటే నేటికి గిరిజన గ్రామాల్లో రహదారుల దుస్థితి ఇలానే ఉంది ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్లిన రోజు చెప్పిన ఇచ్చిన హామీలు ఓటు పడి అధికారం చేతిలో పడగానే గిరిజనులకు ఇచ్చిన హామీలు డస్టుబిన్ లోకి చేరుకుంటాయి తప్ప సరైన విద్య, మెరుగైన వైద్యం సరైన రహదారి ఏర్పాటు మాత్రం ఇంకో 100 వసంతాలు వచ్చినా అభివృద్ధి కావని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సదరు అధికారులు ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మరియు జనసేన పారీ దేవిపట్నం మండల అధ్యక్షుడు చారపు వెంకట రాయుడు డిమాండ్ చేసారు.