గిరిజనుల పోడు భూముల పట్టాలివ్వాలి: జనసేన డిమాండ్

ఎస్. కోట: జనసేన ఆధ్వర్యంలో రేగ పున్యగిరి గిరిజనులకు పోడు బూమి పట్టాలివ్వాలని, హౌసింగు స్కిములు మంజురుచెయ్యాలని బుధవారం తహసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు. 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారము రెగపున్యగిరి, గురిలోవ, డబ్బగుంట, దారపర్తి గిరిజనులకు పోడు భూముల పట్టాలివ్వాలని జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేసి 100 మంది గిరిజనులకు వారు సాగు చేస్తున్న పోడు భూములకు 2009లో పట్టాలిప్పించడం జరిగింది. మిగిలిన 270 మంది ఎస్.కోట మండలము గిరిజనులకు నేటివరకూ సర్వే చేసిన పట్టాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో తహశీల్దారుకి వినతిపత్రం ఇవ్వడము జరిగింది. అలాగే రెగపున్యగిరిలో 11 మంది గిరిజనులకు వబ్బిన సన్యాసి నాయుడు అధ్వర్యంలో ఎస్.కోట రెవెన్యూసర్వే నెంబరు 147లో నివాస స్థలాలు పోరాడి సాధించగా, వారికి హౌసింగ్ ఇళ్లు నేటికీ ప్రభుత్వము నిర్మాణము చేయలేదని, కారణమడి గితే వారికి రేకు ఇల్లులు మంజూరు చేశామని చెబుతున్నారు. కానీ సదరు రేకు ఇల్లులు శిధిలావస్థలో ఉన్నందున తక్షణమే వాటిని రికార్డులను తొలగించి ప్రభుత్వము వారికి 180000 వేల రూపాయలతో వారికి ఇళ్ళ నిర్మాణము చేపట్టాలని తహశీల్దారు వారిని కోరారు. వారి 2 రకాల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. లేనిచో మరల మండలములో గల గిరిజనులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని జనసేన ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు మీడియా సమావేశములో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.