గిరిజన యువత జనసేనాని వెంటే: ఉల్లి సీతారామ్

పాడేరు:చింతపల్లి మడిగుంట గ్రామంలో గురువారం జనసేన మండల నాయకులు ఉల్లి సీతారామ్ జనసేన పార్టీ కరపత్రం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గిరిజన సమస్యలపై ఉదాసీనత ప్రదర్శిస్తుందని ఇచ్చిన హామీలు కంటే తమ ధనార్జనే ద్యేయంగా గిరిజన ప్రాంత హక్కుల్ని తుంగలో తొక్కి అక్రమ మైనింగ్, గ్రామసభ ఆమోదం లేకుండా పవర్ ప్రాజెక్టులతో గిరిజన బ్రతుకుల్ని బుగ్గిపాలు చెయ్యాలని చూస్తుందని మండిపడ్డారు. గిరియువతకు కల్పతరువు లాంటి జీవో నెం3 కోల్పోయాం, మన హక్కుల్ని కోల్పోతున్నాం, ఇప్పటికైనా గిరిజన ప్రజలు మేల్కొకపోతే భవిష్యత్ తరాలకు బావిష్యత్తే లేదని, గిరిజన బ్రతుకులపై ఆలోచన చేసే నాయకులు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కరని జనసేనాని మాత్రమే మన కష్టాలను తీరుస్తాడాని అన్నారు. గిరిజన జాతి అంతం కోసం కక్ష్య కట్టిన బూర్జువా పార్టీలను చూసేసామని ఇకనైనా పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇచ్చి మన ప్రాంతాన్ని, మన విలువైన ప్రకృతి సంపదను కాపాడుకుందమని అన్నారు. ఓ గిరిజనుడా మేలుకో ఈ రాష్ట్రం నాయుడ్ల సొత్తు కాదు, రెడ్ల సొత్తు కాదు శ్రామిక, దళిత, గిరిజన, బడుగు బలహీనులదని ఆ అణగారిన వర్గాలు రాజ్యాధికారాలు సాధిస్తే కానీ సమసమాజం ఏర్పాటు సాధ్యం కాదని పవన్ కళ్యణ్ గారు తలిచారని, మనమందరు రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ పాడేరు నియజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పని చేద్దామని అన్నారు. అలాగే గతా మూడు రోజుల క్రితం వాలంటీర్ల కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన వాక్యాలు మీడియా వక్రీకరించిందని రాజాకీయా ఎత్తుగడలలో ఇదో రకం కుహనా మేధస్సు అని దుయ్యబట్టారు. నిజానికి వాలంటరీ వ్యవస్థలో లోపాలు, వాస్తవాలు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ ఎన్.సి.బి.ఆర్ చెప్పిన వాస్తవాలని, ఆ విషయం వాలంటీర్లకు తెలియకపోవడం విడ్డురమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను పూర్తిగా తప్పుదోవ పట్టించిందని ఒకరకంగా చెప్పాలంటే వలంటీర్ వ్యవస్థని చాలా చక్కగా రాజకీయాలకు ఉపయోగించుకుందని అన్నారు. ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసే వాలంటీర్లు ఒక ఆలోచన చెయ్యాలని పవన్ కళ్యాణ్ యువత ఉపాధి కల్పన కోసం ఒక బృహత్తర ప్రణాళిక రూపొందించారని దయచేసి గమనించండని అన్నారు. ఏది ఏమైనా గిరిజన యువత జనసేనాని వెంటే ఉందని, మార్పుకోసం శక్తి వంచన లేకుండా మా వంతు కృషి చేస్తామని అన్నారు.