గిరిజన యువత క్రీడల్లో రాణించాలి..!

జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి గిరిజన యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందించడానికి వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన యువత గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసలుగా మారకుండా, క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆసక్తితో క్రీడల్లో రాణించే యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లను అందిస్తూ ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. అతను గిరిజన యువతకు మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం క్రీడలు ఎంతో ఉపయుక్తమని, ఇప్పటికే గిరిజన యువత జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన శిక్షణ అందించి గిరిజన జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వివరించారు. సహజంగా గిరిజన ప్రాంతంలో పెరిగే యువత శారీరక దృఢత్వం కలిగినవారిగా ఉంటారని, కానీ సరైన శిక్షణ లేక, ఆర్థిక ఇబ్బందులతో అనేకమంది క్రీడాకారులు గ్రామాల్లోనే అనామకంగా ఉంటున్నారని తెలిపారు. సరైన శిక్షణతో, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సహకారంతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా అనంతగిరి మండలం దండబాడు గ్రామ యువతకు వాలీబాల్ కిట్లను స్థానిక గ్రామ కెప్టెన్ కిల్లో కుమార్, వైస్ కెప్టెన్ చిట్టం రవి సింహాద్రి, మరియు టీమ్ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కొర్ర రవి, పాంగి లక్ష్మణ్, ఎస్. రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment