కుళాయి మరమ్మతులు చేపట్టాలని ఖాళీ బిందెలతో గిరిజనులు నిరసన

అరకు నియోజకవర్గం, అరకువేలీ మండలం చోంపి పంచాయతీ పరిధిలో గల మర్రి వలస గ్రామం లో కుళాయి మరమ్మత్తులు చేపట్టి గిరిజనులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సోమవారం ఉదయం జనసేన పార్టీ ఎక్స్ ఎం.పీ.టీ.సీ సాయిబాబా, దురియా, అల్లంగి, రామకృష్ణ, పొద్దు, అర్జున్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సమావేశమై.. అనంతరం గ్రామాల్లో కుళాయి మరమ్మత్తు ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని.. ప్రభుత్వానికి తెలిసేలా ఖాళీ బిందెలతో గిరిజనులు నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన ఎక్స్ ఎం.పి.టి.సి సాయి బాబా, రామకృష్ణ, అర్జున్ తదితరులు మాట్లాడుతూ.. మర్రివలస గ్రామంలో నెలకొన్న కుళాయి మరమ్మత్తు చేపట్టి మంచినీరు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.