ఆర్మీలో సేవలందించిన ఆగురు శ్రీనుకు చిరు సత్కారం

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగురు మణి భర్త ఆగురు శ్రీను భారత ఆర్మీలో గత 17 ఏళ్లగా సేవలు అందించి సోమవారం పదవి విరమణ చేసి స్వస్థలం నర్సిపురం గ్రామానికి విచ్చేసిన సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, నియోజకవర్గం నాయకులు అక్కివరపు మోహన్ రావు మరియు నాయకులు కలిసి భారతదేశం కోసం బోర్డర్ లో అను నిత్యం యుద్ధం చేసే శ్రీను గారికి చిరు సత్కారం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు ఆగూరు మణి, బొబ్బిలి అధ్యక్షులు గంగాధర్, కాతా విశ్వేశ్వరావు, మణికంఠ, శివశంకర్ పోతల, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు స్వామి నాయుడు, సత్యనారాయణ, ఆది మరియు నర్సిపురం గ్రామ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.