పాలకొండ జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘననివాళి

పాలకొండ, భారతరత్న బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనే జనసేన లక్ష్యం బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం కంబరవలస గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స.పుండరీకం మాట్లాడుతూ దేశ ప్రజలందరికి సమాన హక్కులు, సమాన గౌరవం, సమాన అవకాశాలు చేరువకావలని బీ.ఆర్ అంబేద్కర్ పరితపించారు. బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మూడు మాటలు
1.ఎడ్యుకేషన్ – ప్రతి పౌరుడు విద్యావంతుడిగా మారాలి భవిష్యత్ ని లిఖించుకోవాలని అన్నారు.

  1. ఆర్గనైజ్ – సమాజాన్ని సంఘటితంగా ఉంచాలని అన్నారు.
  2. యాజిటేట్ – పోరాటం చేయడం తద్వారా హక్కుల సాధన, సంరక్షణ కోసం ఎలుగెత్తి నినదించాలని అన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఆశయాలకు, రాజ్యాంగంకి వ్యతిరేకంగా వైస్సార్సీపీ పరిపాలన సాగుతుంది అని అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలనా చేస్తుందని పుండరీకం అన్నారు. జనసేన జాని మాట్లాడుతూ బి.ఆర్. అంబేద్కర్ అన్ని కులాలకు చెందిన వారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో భారతదేశం సమఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేద్కర్ ఆశించారు. నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌళిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా పరిపాలన చేస్తూవుండడం విషాధకారం. ఈ కలియుగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వినోదు, కలమట పోలీస్, దండెల సతీష్, చందు, గోడబ మహేష్, జనసేన జాని, జనసేన క్రియాశీలక సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.