కళ్యాణదుర్గం పట్టణంలో బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఘననివాళి

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణంలో శుక్రవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది. అణగారిన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను విలువలను ఎల్లప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు, జనసైనికులు ఆచరిస్తూ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాము. “నేను, నా దేశం ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది” ఎంత గొప్ప మాటలు? ఇంత మంచి మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు? రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అందించి, ఈ దేశం సమైక్యంగా, సమున్నతంగా, సమభావంగా, శక్తివంతంగా ముందుకు సాగడానికి పద నిర్దేశం చేసిన దేశభక్తుడు. అంబేద్కర్ వంటి మహా జ్ఞాని కోటికొక్కరు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విద్యావేత్తగా, మేధావిగా, న్యాయకోవిదునిగా, పాత్రికేయునిగా, రాజకీయ నాయకునిగా, రాజ్యాంగ నిర్మాణ సారధిగా, న్యాయశాఖామంత్రిగా ఆయన ఈ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివి. విమర్శలకు వెరవని అంబేద్కర్ ‘ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే.. నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం’ అంటారు. “మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి” అని అణగారిన వర్గాలలో ధైర్యం నింపారు. అస్పృశ్యత, అంటరానితం నిర్మూలనకు తన జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేసి అసామాన్యునిగా నిలిచారు. అందుకేనేమో ఆయన ‘భారతరత్న’గా ప్రకాశిస్తున్నారు. ఆ మహానుభావుని మూలసూత్రాలు ఆధారంగా జనసేన ప్రస్థానం చిరంతనంగా సాగుతుందని ప్రమాణం చేస్తూ ఆయన బోధించిన ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనంకోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అనే మాటలను మననం చేసుకుంటూ శాంతిమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళి అర్పించిన జనసేన నేతలు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జైకృష్ణ, కాంత్ రాజు, వీరమహిళ షేక్ తార, జనసేన నాయకులు జాకీర్ హుస్సేన్, సి.పి వంశీకృష్ణ, శ్రీహర్ష, ముక్కన్న, షేక్ రజాక్, ఉదయ్, అనిల్, మహేష్, శ్యామ్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.