బండివాండ్లపల్లి దళితవాడలో 66వ వర్ధంతి సందర్భంగా డా.బి.ఆర్.అంబేద్కర్‌ కి ఘన నివాళి

రాజంపేట: మంగళవారం ఉదయం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలో టి. సుండుపల్లి మండల కేంద్రం మరియు రాయవరం గ్రామ పంచాయతీ బండివాండ్లపల్లి దళితవాడలో డా.బి.ఆర్.అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలు సూచనలతో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలక వర్గాలు చేస్తున్న అక్రమ అరాచక దౌర్జన్యాల పట్ల కొంచెం బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని కోరుతూ భారత రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న వారికి రాబోయే కాలంలో సరైన రీతిలో సమాధానం చెపుతామని పిలుపునిచ్చారు. అలానే బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆశయాలను, ఆకాంక్షలను అందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్‌ భారతీయ సమాజాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు కాబట్టే సామాజిక సమానత్వపువిద్య, రాజకీయ, వైద్యం, వివిధ రంగాలలో అట్టడుగున ఉన్నటువంటి పేదవారికి అభివృద్ధి ఫలాలు చేరాలని తపించిన ప్రదాత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు,జనసైనికులు, ప్రజాసంఘాలు, వివిధ సామాజికవర్గ నేతలు, పాల్గొన్నారు.