‘ఆచార్య’ మూవీ సెట్ లో రియల్ హీరో ‘సోనూసూద్’ కి సత్కారం

తన సేవా గుణంతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న రియల్ హీరో సోనూసూద్ ని ఆచార్య మూవీ సెట్ లో సత్కరించారు. లాక్ డౌన్ నుంచి ఇప్పటి వరకు ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయాన్ని అందిస్తూనే ఉన్నారు సోనూసూద్‌. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న సోనూసూద్‌ను ‘ఆచార్య’ సెట్‌లో నటుడు తనికెళ్ల భరణి, డైరెక్టర్‌ కొరటాల శివ ప్రత్యేకంగా సత్కరించారు. పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా బహుకరించారు. ఈ కార్యక్రమంలో కొరటాల శివ సహా ఇతర టీమ్‌ సభ్యులు కూడా పాల్గొన్నారు. కరోనా సమయంలో వందలాది మందికి చేయూతనందించి సోనూసూద్‌ స్ఫూర్తినిచ్చారని తనికెళ్ల భరణి అప్రిషియేట్‌ చేశారు. ఈ సంద్భంగా సోనూసూద్‌ మాట్లాడుతూ ముంబై కంటే దక్షిణాది సినిమాల్లో నటించేటప్పుడే తనకు ఇంట్లో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుందని, ఇక్కడ ప్రేక్షకులు అందించే ప్రేమను మాటల్లో చెప్పలేనని, అందుకే బాలీవుడ్‌ సినిమాల కంటే దక్షిణాది సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతానని చెప్పారు.