విధినిర్వహణలో ఉండగానే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఆలమూరు పోలీస్ స్టేషన్‌కి చెందిన ఎస్.ఐ ముద్దాల అశోక్ వీర మరణం పొందారు. ఆయన భౌతికకాయం నర్సాపురం పట్టణంలోని స్వగృహానికి చేరిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. “విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ముద్దాల అశోక్ గారు పోలీసు విభాగానికే గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయన వంటి అధికారుల సేవలను మనం ఎప్పటికీ మర్చిపోలేము. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా తోడుంటాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ అధికారులు, పార్టీ నాయకులు, బంధువులు మరియు ప్రజలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
Share this content:
Post Comment