క్రీడాకారుడు యూసఫ్ కు సన్మానం..!

మదనపల్లిలో రాయలసీమ షూటింగ్ బాల్ ఇంచార్జ్ నరేష్ బాబు వారి సతీమణి అన్నమయ్య షూటింగ్ బాల్ సెక్రటరీ గౌతమి, ప్రముఖ క్రీడాకారుడు యూసఫ్, జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ మరియు నా సేన నా వంతు కోఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత మహిళా దినోత్సవం సందర్భంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం, దారం అనిత గత నెల ఫిబ్రవరి 1, 2, 3 వ తేదీలలో నేపాల్ లో జరిగిన రెండవ ఏషియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ లో పాకిస్తాన్ పై విజయం సాధించిన మరియు ఇటీవల తెలంగాణ నల్గొండ జిల్లాలో ఆంధ్ర తరపున టీం విన్నర్స్ గా నిలిచిన అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన క్రీడాకారుడు యూసఫ్ సాధించిన విజయాలను అభినందిస్తూ దుశ్శాలువాతో యూసఫ్ ను సత్కరించారు. భవిష్యత్తులో, యూసఫ్ ఇలాగే క్రీడలలో రాణించి మరిన్ని పథకాలు భారతదేశానికి తీసుకురావాలని, భారతదేశం కీర్తిని పెంచాలని ఆశీర్వదించారు. జనసేన పార్టీ తరపున ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటారని తెలియజేశారు.

Share this content:

Post Comment