*జనసేన నాయకుడు రామ శ్రీనివాస్
అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం మాచిరెడ్డిగారిపల్లి గ్రామపంచాయతీకి చెందిన చిన్నబిడికి వాసి సుబ్బరం నాయక్ సోమవారం రాత్రి బెస్తపల్లి – బూడిదేటిపల్లి మార్గ మధ్యలో ద్విచక్ర వాహనంపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర వార్త తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, స్థానిక రాజకీయ నాయకులు హాజరై ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.
Share this content:
Post Comment