సత్తెనపల్లి జనసేన ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులు

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద వర్ధంతి మరియు అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహన రంగా జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా అమరుల చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వివేకానందుని లోని స్ఫూర్తిని, అల్లూరిలోని విప్లవాగ్నిని కలగలిపి ఆ మహనీయులు ఇద్దరు పుట్టినరోజునే ప్రభవించిన మరో విప్లవస్ఫూర్తిని రగిలించిన దివిటీ స్వర్గీయ వంగవీటి. మంగళవారం ఆ నలుగురు మహనీయులను చిరస్మరణీయమైన వారి త్యాగాలను మరో సారి స్మరించుకున్నారు. అనంతరం వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా సత్తెనపల్లి కాపు సంఘం హాస్టల్ లో ఉన్న రంగా గారి విగ్రహానికి అలాగే వడ్డవల్లి పోలేరమ్మ తల్లి గుడి వద్ద ఉన్నారా విగ్రహానికి నివాళి అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి తిరుమలశెట్టి మల్లేశ్వరి, పట్టణ నాయకులు రాడ్లు శీను, బత్తుల వీరాంజనేయులు, సోమిశెట్టి సుబ్రమణ్యం, అంబటి పున్నరావు, శిరిగిరి మణికంఠ, పుల్లం శెట్టి భాను, ఎలిశెట్టి రాంగోపాల్, కుడితిరి సిసింద్రీ, అన్నపురెడ్డి శ్రీనివాసరావు, పూర్ణ, తిరుమల శెట్టి సాంబ, మహేష్, ఏద్దనపూడి నరేష్, పోతంశెట్టి వెంకటేష్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పట్టణ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.