మర్రిపాడు మండల జనసేన పార్టీ జనసైనికులకు సత్కారం

మర్రిపాడు మండల కేంద్రంలో మండల నాయకులు చిన్నా జనసేన అధ్యక్షతన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కోట్టె వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఫ్రూట్స్ స్వీట్స్ పంచటం జరిగింది. అనంతరం మర్రిపాడు మండలంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న జనసైనికులు
వనం పవన్ కుమార్, ఉదయ్ చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన, జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్ కుమార్ మండల ప్రచారకార్యదర్శి ఉదయ్, గంటా అంజి మరియు స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు.