గెయిల్‌ ప్రమాద అమరులకు గౌరవ నివాళి

*స్థూపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, నగరం గ్రామంలో 2014 జూన్ 27న జరిగిన గెయిల్‌ పైప్‌లైన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన 22 మంది అమరుల స్మృతికి పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగరం గ్రామంలో మృతుల పేరిట నిర్మించిన స్థూపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధిత కుటుంబాలకు ఎప్పటికీ తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఘటన అనంతరం ప్రభుత్వం ప్రకటించిన 11 హామీల అమలుకు అవసరమైతే స్వయంగా ముందుండి పోరాడతానని హామీ ఇచ్చారు. నివాళి సభలో మృతుల కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొని అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమం బాధితుల పట్ల ప్రజల్లో సానుభూతిని నింపింది.

Share this content:

Post Comment