త్యాడ రామకృష్ణారావు కు చిరు సత్కారం

విజయనగరం: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకల సందర్భంగా.. ఆదివారం కణపాక యూత్ హాస్టల్లో.. శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల నిర్వాహకులు నందమూరి తారక రామారావు సేవాసమితి వ్యవస్థాపకులు ఎం. అప్పారావు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏ.ఆర్, విజయనగరం డి.ఎస్పీ ఎల్. శేషాద్రి వారి చేతులమీదుగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, త్యాడ రామకృష్ణారావు(బాలు) కు చిరు సత్కారం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ శ్రీ ఎం.అప్పారావు గారికి ధన్యవాదములు తెలియజేసారు.