నెల్లూరు, బాల్య వివాహాలు, సతీసహగమనం నిర్మూలించడంలో వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించటంతో పాటు మహిళలు విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా ఇన్చార్జీ వేములపాటి అజయ్ సూచనలతో జనసేన పార్టీ తరపున నెల్లూరు సిటీ మిని బైపాస్ నందు గల దంపతుల విగ్రహానికి మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరాని రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో అనేక సంస్కరణలను అమలుపరిచిన జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే బాల్య వివాహాలు నిర్మూలించడంలో సతీసహగమనం నిర్మూలించటంలో, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించటంతో పాటు మహిళలు విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసి ఉపాధ్యాయునిగా మారి అనేకమందికి మహిళలకు విద్యను అందించారు. మహిళ విద్యావంతురాలు అయితే కుటుంబం వివేకమంతమవుతుందని ఆమె సమాజానికి తెలియజేశారు. ఇదే విషయాన్ని జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఇంటిల్లిపాది చక్కగా సర్దిపెట్టగల మహిళలు రాజకీయాల్లోకి రావాలని పలుమార్లు తెలియజేశారు. స్త్రీ సాధికారతం కోసం, రాజకీయ ప్రవేశం కోసం మహిళలు ఒంటరిగా భావించవద్దు వారి కుటుంబ సభ్యులతో పాటు జనసేన నాయకులు, వీర మహిళలు తోడుగా ఉండాలని మరొక్కసారి తెలియజేస్తూ సావిత్రిబాయి ఆశయాలను కొనసాగిస్తామని తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల వారి సతీమణి విజయలక్ష్మీ గునుకుల, వీర మహిళలు ప్రవల్లిక, శాంభవి, జిల్లా కార్యదర్శి ప్రశాంత్ తో యాసిన్, వెంకీ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment