ఏలూరు జనసేన కార్యాలయంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి రెడ్డి అప్పలనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాద ఉక్కు సంకెళ్ల మధ్య నలిగిపోయిన దేశ ప్రజలకు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం లభించిందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛగా మనుగడ సాధించే అవకాశం కలిగిందన్నారు. విభిన్న వర్గాలకు కావలసిన వసతులు, జీవన సరళకి కావలసిన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి వారి సంక్షేమానికి బాటలు వేశారని కొనియాడారు. చట్టానికి, రాజ్యానికి లోబడి ఐఏఎస్, ఐపీఎస్, న్యాయ వ్యవస్థతో పాటు అధికారులందరూ పనిచేస్తున్నారన్నారు. అయితే కొన్ని ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడంపై రెడ్డి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ భారత రాజ్యాంగ స్ఫూర్తితో చైతన్యవంతులై ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో సమాజ ప్రగతి కోసం బాటలు వెయ్యాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యం అన్నారు. రాజ్యాంగం స్ఫూర్తిని అందరిలో నింపుదామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణి, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, మహిళ కార్యదర్శి ఉమా, పార్టీ నాయకులు బొండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, వల్లూరి వంశీ, నూకల సాయి ప్రసాద్, బాలు తదితరులు పాల్గొన్నారు.