ధర్మవీర్ శ్రీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ తను నమ్మిన ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన పవిత్ర రోజును కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు శంభాజీ మహారాజ్‌కు నివాళులర్పించి, వారి అధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన “చావా” చిత్రాన్ని వీక్షింపజేశారు. అదే విధంగా, మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను పురస్కరించుకుని “చలో పిఠాపురం” పోస్టర్‌ను ఆవిష్కరించారు. కోరుట్ల నుండి ఈ సభకు హాజరయ్యే జనసైనికులు, అభిమానుల సౌకర్యార్థం మార్చి 13వ తేదీన ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సభకు రావాలనుకునే వారు 9010431999, 9030458143 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు వోడ్నాల రామారావు, జనసైనికులు సాయికృష్ణ, విజయ్, శశి, సురేష్, ప్రశాంత్, అనిల్, రంజిత్, రాజేందర్, భీమరాజ్, అభినవ్, సంజీవ్ మరియు సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు సురేష్, సంపత్, అమరనాథ్, జగదీశ్, నరేందర్ పాల్గొన్నారు. సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులు మరియు కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు.

Share this content:
Post Comment