జనసేన ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు ఘననివాళులు

మైలవరం నియోజకవర్గం: స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 37వ వర్ధంతి సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ మరియు అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అశోక్ బాబి, రాగల నాని, శ్యామల సుజాత, పగిడిపల్లి వెంకట్, దేవరకొండ చరణ్ మరియు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.