నంద్యాల జిల్లా, యువ రక్తం ఉరకలెత్తే లేలేత వయసులోనే, దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉరికొయ్యలకు వేలాడిన విప్లవ చైతన్యమూర్తులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల అసమాన త్యాగనిరతిని స్మరించుకుంటూ వారి వర్ధంతులు, జయంతులే కాకుండా వారి ఆశయాలను బలంగా తీసుకెళ్లాలని యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నంద్యాల జనసేన నాయకులు చందు సుందర్ తెలియజేశారు. నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జనసేన నాయకులు జనసేన రాము, శివశేఖర్, సలాం బాషా, రమణ, ఫణీంద్ర, రవి, హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment