గూటం లక్ష్మికి ఘన నివాళులు

*నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పి. గన్నవరం ఎన్‌టీవీ రిపోర్టర్ గూటం శ్రీనివాస్ తల్లి లక్ష్మి శుక్రవారం ఉదయం అనారోగ్యంతో పరమపదించారు. ఈ విషాదవార్త తెలిసిన వెంటనే పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వారి నివాసానికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి, నమస్కరించి, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ కి మరియు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. లక్ష్మి గారు ధైర్యసాహసాలు కలిగిన మహిళగా, కుటుంబానికి ఆధారంగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు, బంధువులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని తమ సంతాపాన్ని తెలియజేశారు.

Share this content:

Post Comment