జనసేన వీరమహిళ యన్నం ద్రాక్షాయనికి నివాళులు

జనసేన వీరమహిళ యన్నం ద్రాక్షాయనికి దశ దిన కర్మ కార్యక్రమనికి హాజరై నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన కంకణాల శంకర్, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు, గుగ్గిళ్ల సురేష్, తాడికొండ జనసేన పార్టీ నాయకులు, నవబోతు తేజ, గుంటూరు జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షులు మరియు వెనిగండ్ల హరి, జనసేన పార్టీ గుంటూరు జిల్లా యువ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొన్నూరు లో జనసేన పార్టీ బలోపేతం చెయ్యడం లో యన్నం ద్రాక్షాయని కృషి మరువలేనిది అని అన్నారు, ఆమెని మేము బుజ్జమ్మా అని ఎంతో ప్రేమగా చూసుకొనే వాళ్ళం రాష్ట్రంలో పార్టీ కార్యక్రమం ఏది జరిగిన మా అందరికంటే ముందుగా హాజరై మాకు ఆదర్శంగా నిలిచింది, ఆమె ఆశయాలు ముందుకు తీసుకువెళతామని అన్నారు.