*వారి కుటుంబానికి అండగా జనసేన
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్‌కు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త బాయన వెంకటరమణ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో, జనసేన నాయకురాలు తిరుపతి అనూష సురేష్ ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మంతాపురం రాజేష్, కూర్మా రావు, దిండి దుర్గారావు, గుండపు అక్షయ్ కుమార్, దుక్క సాంబ, ఆవుల ఆనంద్ తదితరులు కూడా కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Share this content:
Post Comment