నేతాజీ కి ఘన నివాళులు

వైజాగ్ వెస్ట్: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి పురస్కరించుకొని విశాఖ పశ్చిమ నియోజకవర్గ 56వ వార్డ్ జనసేన నాయకులు పిల్లా సాయిరాం, ధర్మేంద్ర అధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కంచరపాలెం మెట్టు మీద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులు పీలా రామకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని నేతాజీకి గజమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు పవన్ ఆనంద్, నరేంద్ర, నాయుడు, రవి కుమార్, 56వ వార్డ్ జనసైనికులు పాల్గొన్నారు.