జనసేన ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలతో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకుని కాకినాడ సూర్యనారాయణపురంలో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వాసిరెడ్డి శివ మాట్లాడుతూ ఈ విగ్రహం కాకినాడలో సూర్యనారాయణపురంలో మొట్టమొదటిగా ఏర్పాటుచేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అని అటువంటి మహానుభావునికి ఇవాళ నివాళులర్పించడం తమ అదృష్టమనే అని తెలిపారు. భాష ప్రయోక్త రాష్ట్రాల ఏర్పాట్లు ఆ మహానీయుడు కృషి వలన ఆయన ఆత్మ త్యాగం వలన మాత్రమే ఏర్పడ్డాయని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం అంతటి గొప్ప నాయకుడు యొక్క పోరాట పటిమ మరియు ఆత్మ త్యాగం వలనే అని భావితరాలకు ఆ స్ఫూర్తి ఆదర్శం అని తెలిపారు. ఆయన పట్టుదలతో 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారని కానీ ఈ లాంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే పేరుగాంచిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన ఆ మహానుభావుడు యొక్క దీక్ష పట్టుదల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన తెలిపారు. రఘు శాంతి స్కూల్ రమణ మాస్టర్ మాట్లాడుతూ కాకినాడలో మొట్టమొదటిగా ఈ విగ్రహం ఏర్పాటు విషయంలో తాను కూడా ఉన్నానని అలాంటి మహనీయుని స్మరించుకోవడం చాలా ఆనందమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తలాటం సత్య, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, నాయకులు ఆకుల శ్రీనివాస్, వాసిరెడ్డి సతీష్, దారం సతీష్, షమీర్, కసుమూర్, సాయి, అజయ్ యాదవ్, మిరియాల హైమావతి, చీకట్ల వాసు, మనోహర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.