రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు సుంకర నాగేశ్వరరావు (మురళి) ఇటీవల పరమపదించిన విషయం తెలిసిందే. సోమవారం నిర్వహించిన చినకార్యం కార్యక్రమంలో, జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి పాల్గొని, వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెబుతూ ఆమె పరామర్శించారు. ఈ కార్యక్రమంలో దివాన్ చెరువు గ్రామ నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
Share this content:
Post Comment