తణుకు జనసేన ఆధ్వర్యంలో వంగవీటికి ఘన నివాళులు

తణుకు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, అత్తిలి గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు, అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వన్నెం ప్రభు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ దిరిశాల వెంకట్. ఈ కార్యక్రమంలో అత్తిలి మండలం జనసేన పార్టీ నాయకులు, తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.