ఒక్కసారి జనసేనను నమ్మి ఆదరించండి: రాటాల రామయ్య

  • పవనన్న ప్రజా బాట 45వ రోజు

ఒంటిమిట్ట: కుల మతాలకు అతీతమైన పార్టీ జనసేన పార్టీ అని ఒక్కసారి నమ్మి జనసేనను ఆదరించాలని పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు మంగళవారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్తపల్లె, ఎస్సీ కాలనీ పలు గ్రామాల్లో 45వ రోజు ఇంటింటికి జనసేన పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడి పలు సమస్యలను అడిగితెలుసుకున్నారు. జనసేన పార్టీ అధినేత రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. వైసిపి అరాచక పాలనను ప్రజలు దృష్టిలో పెట్టుకొని రానున్న 2024 ఎన్నికల్లో ఒక్కసారి నమ్మి జనసేనను ప్రజలందరూ ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి నరసమ్మ లోక, రమ, గౌరీ తదితరులు పాల్గొన్నారు.