నిజం గెలిచింది – రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం

  • చంద్రబాబుకు బెయిల్ రావడంతో జనసేన-టిడిపి శ్రేణులతో కలిసి అలిపిరిలో కొబ్బరికాయలు కొట్టిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, చంద్రబాబుకు బెయిల్ రావడంతో నిజం గెలిచిందన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. మంగళవారం ఆయన టిడిపి, జనసేన శ్రేణులతో కలిసి అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. నిజం గెలవాలంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన పోరాటం సఫలీకృతమైందన్నారు. తిరుమల శ్రీవారి ఆశీసులతో చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు అరెస్ట్ కాగానే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో గెలిచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు గిఫ్ట్ గా ఇస్తామన్నారు.

  • రాష్ట్రానికి ముందే దీపావళి

చంద్రబాబు బెయిల్ పై విడుదల కావడంతో తిరుపతి పార్లమెంట్ టిడిపి కార్యాలయం వద్ద జరిగిన సంబరాల్లో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. చంద్రబాబు విడుదల కావడంతో రాష్ట్రంలో ప్రజలు ముందుగానే దీపావళి పండుగ చేసుకుంటున్నారన్నారు. నరకాసుర వధతో చెడుపై మంచి గెలిచిందని, జగనాసురుడిని ఇంటికి పంపితే నిజం గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ తిరుపతి, అసెంబ్లీ ఇంఛార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, నగర కార్యదర్శి ఆనంద్, నగర ఉపాధ్యక్షులు బాబ్జీ, పార్ధు లక్ష్మి, నగర కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, రాజేష్ ఆచారి, హిమవంతు, మునస్వామి, జనసేన నాయకులు వీరమహిళలు శిరీషా, లావణ్య, దుర్గ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహులు యాదవ్, దంపూరి భాస్కర్, వూక విజయ్ కుమార్, వర్మ, కోడూరు బాలసుబ్రమణ్యం, పులిగోరు మురళి, ఆర్ సి మునికృష్ణ, మాజీ యమ్ యల్ సి గౌను వారి శ్రీనివాసులు తదితరులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.