సత్యం వధ.. ధర్మం చెర..

  • ఇసుక త్రవ్వకాలపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలియజేయడానికి వెళుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అక్రమ అరెస్ట్

గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక త్రవ్వకాలకు సంబంధించి లీజు గడువు పూర్తయినప్పటికీ జేపీ కంపెనీని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఇసుక త్రవ్వకాలు జరుపుతున్నారు. ఈ త్రవ్వకాలలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం గుండిమేడ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ తర్వకాలపై రెండు రోజుల క్రితం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి లీజు అయిపోయిన కాగితాలను పోలీస్ వరకు అందజేయడం జరిగింది. అయినప్పటికీ ఇసుక త్రవ్వకాలు యదేచ్చగా జరుగుతున్నాయి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడానికి వెళుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులను పోలీసు వారు హౌస్ అరెస్ట్ చేసి అక్కడినుండి నగరంపాలెం పోలీస్ స్టేషన్ తరలించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ నాయకులను కూడా అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు,జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి చేరుకుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుని వెంటనే విడుదల చేయాలని, అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. కొంతసేపటి తర్వాత జిల్లా అధ్యక్షులు వారిని విడుదల చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన గాదె మాట్లాడుతూ.. ఎక్కడైనా దొంగతనం జరుగుతుంటే ప్రభుత్వం అడ్డుకుంటుంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే దొంగతనం చేయడం అనేది చాలా దుర్మార్గమని, వైసిపి వాళ్లు పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహించడం అనేది వ్యవస్థను దిగజార్చేలా ఉందని, ఇంతకన్నా దారుణం మరోటి లేదని తెలియజేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా.. మాఫియా నడుస్తుందో అర్థం కాని విధంగా పరిపాలన ఉందని తెలియజేశారు. అలాగే ప్రభుత్వం అక్రమ ఇసుక త్రవ్వకాలను వెంటనే నిలిపివేయని పక్షంలో జిల్లావ్యాప్తంగా నిరసన ఉధృతంగా చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఏసీమెంబెర్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడమనేది ప్రతిపక్షాల హక్కు అని, ఆ హక్కులను కూడా వైసిపి ప్రభుత్వం కాలరాస్తుందని ఎద్దేవ చేశారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక త్రవ్వకాలు వెంటనే నిలిపివేయని పక్షంలో జనసేన పార్టీ నుండి ప్రభుత్వం ప్రజల తరపున భారీ నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మాయదారి ప్రభుత్వాన్ని ప్రజలు రానున్న ఎలక్షన్స్ లో ఇంటికి పంపడం ఖాయమని తెలియజేశారు. తదనంతరం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ గారికి అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నయుబ్ కమల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవి కాంత్, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, గుంటూరు పట్టణ అధ్యక్షుడు నెరేళ్ల సురేష్, కార్పొరేటర్ దాసరి లక్ష్మి దుర్గా, పట్టణ కమిటీ సభ్యులు, మండల అద్యక్షులు, పట్టణ డివిజన్ అధ్యక్షులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.