ప్రయత్నం చేస్తున్నా.. RRR టీమ్ కు కేటీఆర్ సమాధానం..

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో నెటీజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పలువురు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నలను సంధించారు. కరోన పై ప్రభుత్వం పోరాడుతున్న తీరును ఆయన వెల్లడించాడు. కేటీఆర్ కు ఈ సందర్భంగా జక్కన్న ఆర్ ఆర్ ఆర్ టీమ్ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సమస్య ను గురించి ఆర్ ఆర్ ఆర్ టీమ్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆక్సిజన్ మరియు రేమిడేసి ఇంకా ఇతర ఔషధాలు బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరకు అమ్ముడు పోతున్నాయి. వాటిని ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అసలు ధరకే ఔషధాలు మరియు ఆక్సిజన్ ను అందుబాటులోకి తీసుకు రావాలంటూ సూచించింది. టీమ్ ఆర్ ఆర్ ఆర్ ట్విట్ పై కేటీఆర్ స్పందించాడు.

దేశ వ్యాప్తంగా కూడా ఆక్సిజన్ సరఫరా కు సంభందించిన నియంత్రణ కేంద్రం పరిధిలోకి తీసుకుంది. ఇక రెండేసివర్ ఔషధం ను అందుబాటు రేట్లకు ఇప్పించడం తో పాటు ప్రతి ఆసుపత్రిలో కూడా ఆడిట్ నిర్వహించి ఔషధాల నిల్వలు పరిశీలించి బ్లాక్ మార్కెట్ ను అరికట్టించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కేటీఆర్ సమాధానం చెప్పాడు.