నిర్మాణ అనుమతులను సులభతరం చేయనున్న టీఎస్‌బీపాస్‌

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు వీలుగా  టీఎస్‌బీపాస్‌ను అమల్లోకి తెచ్చింది. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే అనుమతుల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది, పారదర్శకంగా, సులభంగా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు గాను సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతుల ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ (టీఎస్‌బీపాస్‌)’ను రూపొందించారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచే దీన్ని అమలు చేయాలని భావించినా.. కరోనా నేపథ్యంలో ఆలస్యమైంది. తాజాగా బుధవారం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో టీఎ్‌సబీపాస్‌ అమలుకు ఆమోదముద్ర వేశారు. టీఎస్‌బీపాస్‌ రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలతో పాటు జీహెచ్‌ఎంసీలోనూ వర్తించనుంది.

tsbpass. telangana.gov.in వెబ్‌సైట్‌, మీసేవ కేంద్రాలు, పురపాలక సంస్థలు/ కలెక్టర్‌ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాల్లో టీఎస్‌బీపాస్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.