టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా డా.శోభరాజు

తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా పద్మశ్రీ డాక్టర్ శోభరాజునునియమించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్నమాచార్య ప్రాజెక్టు సలహాదారుగా పనిచేసిన ఆమె రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వేంకటేశ్వర స్వామి పరమ భక్తు రాలైన ఆమె అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి శోభరాజు ఎంతో కృషి చేశారు. ‘అన్నమాచార్య భావనా వాహిని’ అనే సంస్థను ఏర్పాటు చేసి వేలాది మందిని సంగీత కళాకారులుగా తీర్చి దిద్దారు. ఈ సంస్థ ద్వారా సంగీత శిక్షణ, సంగీత ఉత్సవాలు, అన్నమయ్య కీర్తనలపై పరిశోధన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శోభరాజు స్వయంగా భక్తి గీతాలను రచించి.. వాటికి స్వర కల్పన కూడా చేశారు. ఆమె సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను 2010లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి 2013లో ఉగాది పురస్కారం స్వీకరించారు.