కిడ్నీ వ్యాధి బారిన పడిన విద్యార్ధినికి తులసి దర్మచరణ్ ఆర్దిక సాయం

  • కిడ్నీ వ్యాధి బారిన పడిన విద్యార్ధినికి వైద్య ఖర్చులకు ఆర్దిక సాయాన్ని అందజేసిన తులసి దర్మచరణ్

వేద సీడ్స్ – గుంటూరు నగరానికి చెందిన బిటెక్ విద్యార్దిని తెత్తురాజు స్వాతికి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయన్న విషయం వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించి సహృదయంతో ఆమెకు సంవత్సరం పాటు వైద్య ఖర్చులకు, టెస్టులకు అయ్యే 73,200/- రూపాయలను ధర్మచరణ్ శనివారం వేద సీడ్స్ కార్యాలయంలో అందచేశారు. ఈ సందర్భంగా ధర్మచరణ్ మాట్లాడుతూ సన్నిహితుల ద్వారా స్వాతి పరిస్థితి తెలిసిందని, చదువుకునే వయసులో కిడ్నీ వ్యాధి బారిన పడటం ఎంతో బాధాకరమైన విషయమన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా స్వాతి చదువుకుంటూ ధైర్యంగా జీవించడం ఎంతో మందికి స్పూర్తిదాయకం అని అభినందించారు. భవిష్యత్ లో ఇతర వైద్య ఖర్చులకు, కిడ్నీ మార్పిడి సమయాల్లో కూడా ఆర్ధికంగా చేయూతనందిస్తానని ధర్మచరణ్ హమీ ఇచ్చారు. స్వాతి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రాల రంగారావు, వడ్లమూడి రవి, స్వాతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.