*జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
విలువలతో కూడిన జీవన విధానాన్ని అనుసరిస్తూ కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత శిఖరాలు అధిరోహించటమే కాకుండా తన స్వశక్తితో సంపాదించిన కొట్లాది రూపాయలను లక్షలాదిమంది మంది పేద విద్యార్థులకు దానం చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, సంఘ సేవకులు తులసి రామచంద్ర ప్రభు పరిపూర్ణ మనిషికి నిలువెత్తు రూపంగా నిలిచారని గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. శనివారం అరండాల్ పేటలోని యోగి భవన్ లో ఘనంగా జరిగిన తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకల్లో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ శ్రేణులు రామచంద్ర ప్రభుని దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. ఆళ్ళ హరి మాట్లాడుతూ చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివిన ప్రభుకి చదువు ఎంత విలువైనదో తెలుసని అందుకే పేద విద్యార్థులను అయన కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు. తన సంపాదనలో అధిక భాగం సమాజ శ్రేయస్సుకే కేటాయించే ప్రభులాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ప్రభు చేస్తున్న నిస్వార్ధ సేవల స్ఫూర్తితో ఎంతోమంది దాతలు ఆయనతో చేతులు కలిపి సమాజహితంలో భాగస్వామ్యులు అవుతుండటం ఎంతో ముదావాహం అన్నారు. ఆపదలో ఉన్నవారు సాయం అడగక పోయినా కష్టం తెలుసుకొని ఆదుకునే ప్రభులాంటి వ్యక్తులకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ నిండుగా ఉండాలని ఆళ్ళ హరి అభిలాషించారు. కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, నండూరి స్వామి, స్టూడియో బాలాజీ, దళ వాయి సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, ఐలా శ్రీను, కట్ట శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment