బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో పాల్గొన్న తుమ్మల రామస్వామి(బాబు)

కాకినాడ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, బాబూజీగా కీర్తించబడిన మహా నాయకుడు మాజీ కేంద్ర మంత్రి, బాబు జగ్జీవన్ రామ్ అని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పెద్దాపురం మండలం పొలిమేరూ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా బాబు జగజ్జివన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో మొట్టమొదటి పోరాటయోధుడు బాబు జగజ్జివన్ రావు ఆ మహనీయుని జయంతి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఆణగారిన వర్గానికి అండగా ఉండి నేడు వాళ్ళందరినీ పదిమందిలో తిరిగే అర్హత తెచ్చిన మహనీయుడు బాబు జగ్జీవన్ రావు అని తెలిపారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు పులిమేరు జనసేన నాయకులు దుర్గాజీ ప్రజల పాల్గొన్నారు.

Share this content:

Post Comment