అలంపూర్ ఘాట్ వద్ద తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

అలంపూర్ ఘాట్ వద్ద తుంగభద్ర పుష్కరాలు శాస్త్రోక్తంగా ప్రారంభం అయ్యాయి. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరు కాగా..బ్రాహ్మణులు, వేద పండితులు శాస్త్రోక్తంగా తుంగభద్ర నదీ పూజలు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 1.23 నిమిషాలకు మంత్రులు పుష్కర స్నానం చేసి అధికారికంగా పుష్కరాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే అబ్రహం, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.