విద్యానిధి పాఠశాలలో కనువిందు చేసిన కవలలు

*ఘనంగా కవలల దినోత్సవం

అమలాపురం: ఒకే పోలికలతో కనిపించే కవలలను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎవరెవరనేది గుర్తు పట్టడం కష్టం. ఒకే రోజు నిమిషాల తేడాలో పుట్టి, పెరుగుతున్న వారిని గుర్తించడం వారి తల్లిదండ్రులకూ ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది ఒకే పాఠశాలలో వివిధ తరగతుల్లో చదువుతున్న కవల విద్యార్థులను గుర్తించడం బోధించే ఉపాధ్యాయులకు సైతం సమస్యగానే ఉంటుంది. కవలల దినోత్సవం సందర్భంగా అమలాపురంలోని విద్యానిది (విఐఐటీటిఎస్) పాఠశాలలో శనివారం ఏకంగా కవలల విద్యార్థులు ఒక్కచోట చేరి కనువిందు చేశారు. ఈ సందర్బంగా కవల పిల్లలకి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానిది విద్యాసంస్థల అధినేత ఆకుల బాపన్నాయుడు, ప్రిన్సిపాల్ తి. నాగ మాధవి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Share this content:

Post Comment