రెండేళ్లయినా న్యాయం జరగలేదు : దారం అనిత

*విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగి రెండేళ్లు..అయినా బాధితులకు న్యాయం జరగలేదు..!

రెండేళ్ల క్రితం అర్ధరాత్రి దాటాక ఉన్నట్టుండి చాలామందికి ఊపిరి ఆడలేదు ఏదో ఘాటైన వాసన వస్తుందని బయటకు వచ్చారు. వచ్చినవాళ్లు వచ్చినట్టే కింద పడిపోతున్నారు. పిల్లల్ని ఎత్తుకొని బయటకు వచ్చిన ఒక తల్లి వాళ్ళతో సహా గుమ్మం ముందే పడిపోయింది..

రెండేళ్ల క్రితం ఇదే రోజు విశాఖ సమీపంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టైరీన్ విషవాయువు ప్రభావమది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా వేల మంది ప్రజలు అల్లాడిపోయారు. చాలామంది అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. వాళ్లందరినీ తాము ఆదుకుంటామని నాడు ప్రభుత్వం మహా గొప్పగా చెప్పింది.

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని, ఆరోగ్య కార్డులు ఇస్తామని వారితో వాటితో ఎక్కడైనా ఎన్నాళ్లైనా వైద్యం చేయించుకోవచ్చని.. ఆ ప్రాంతంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి అందరికీ సురక్షిత తాగునీరు అందిస్తామని.. అప్పటికప్పుడు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకోవడం తప్ప ఘటన జరిగి రెండేళ్ల అవుతున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు ఈ ప్రభుత్వం.

ఆ ప్రాంత వాసులకు ఏమవుతుందో తెలుసుకునే దిక్కులేదు కాసేపు మాట్లాడితే ఆయాసం, శరీరంపై మచ్చలు, దద్దుర్లు కడుపులో మంట, ఒళ్ళు నొప్పులు, కళ్ల మంటలు, రెండేళ్ల తర్వాత కూడా విశాఖపట్నం సమీపంలోని వెంకటాపురం వాసులకు ఈ బాధలు తప్పడం లేదు. ఘటన సమయంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురికి ఇప్పటికి పరిహారం అందలేదు. దీంతో వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పలుమార్లు వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేదు ఘటన జరిగిన రోజు ప్రాథమిక 145 మంది కి 25 వేల చొప్పున పరిహారం.. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించినందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినందుకు గ్రామంలో కేసు నమోదు చేశారు. దీంతో అసలు ఎవరూ ముందుకు రావడం లేదు, వీరి గోడు వినేదెవరు.. వీళ్లకు న్యాయం జరిగే దెప్పుడు. ప్రభుత్వము ఈ విషయంపై స్పందన ఉందా లేదా చెప్పాలని జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేశారు.